భారత్కు హెచ్ఏఏఎస్డబ్ల్యూలను విక్రయించనున్న అమెరికా
సముద్ర జలాల్లో భారత యుద్ధ సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. 5.28 కోట్ల డాలర్ల విలువైన హై అల్టిట్యూడ్ యాంటీ సబ్మెరైన్ వార్ ఫేర్ (హెచ్ఏఏఎస్డబ్ల్యూ) సోనోబాయ్లను మన దేశానికి విక్రయించాలని అమెరికా తాజాగా నిర్ణయించింది. సోనోబుయ్లను గగనతలం నుంచి ప్రయోగిస్తారు. వీటిలోని ఎలక్ట్రో మెకానికల్ సెన్సర్లు నీటిలో ధ్వనులను పసిగట్టి రిమోట్ ప్రాసెసర్లకు చేరవేస్తాయి. ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్ల నుంచి జలాంతర్గామి విధ్వంసక కార్యకలాపాలు చేపట్టడానికి హెచ్ఏఏఎస్డబ్ల్యూలు భారత్కు బాగా దోహదపడతాయని ఆమెరికా పేర్కొంది.






