అమెరికా వైఖరి అవాంఛితం : రణధీర్ జైస్వాల్
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు అవాంఛితమని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. స్వతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలు మన దేశానికి గర్వకారణమని, విదేశీ శక్తుల ప్రభావం నుంచి వాటిని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశ ఎన్నికల, చట్టపరమైన ప్రక్రియల్లో బాహ్యశక్తుల ప్రమేయం ఆమోద యోగ్యం కాదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర నిరసన తెలియజేశాం అని వెల్లడిరచారు. దేశంలో చట్ట ప్రకారమే న్యాయ ప్రక్రియ నడుస్తుందన్నారు.






