America: భారత్, పాక్‌తో మంచి సంబంధాలే : అమెరికా

భారత్, పాకిస్థాన్‌లతో మంచి సంబంధాలే ఉన్నాయని అమెరికా (America) వెల్లడిరచింది. రెండు దేశాలతో కలిసి పనిచేయడం ఆ ప్రాంతానికి, ప్రపంచానికి శుభవార్తని పేర్కొంది. వాణిజ్య చర్చల్లో భారత్ (India) వెనక్కి తగ్గడం లేదని, ఆయినా ఆ దేశంతో పాటు మిగిలిన దేశాలతో అక్టోబరు కల్లా ఒప్పందాలు కుదురవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్ (Pakistan)తో కలిసి పని చేయడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. అందరికీ పరిచయమున్న అధ్యక్షుడు, అందరితో మాట్లాడే అధ్యక్షుడి కారణంగా భారత్, పాకిస్థాన్‌లతో సంబంధాలు బాగున్నాయి. భారత్, పాక్ వివాదం జరిగినప్పుడు మాకు ఒక అనుభవం ఉంది. అది చాలా భయంకరమైనదిగా మారే అవకాశం ఉంది. దాడులను ఆపడానికి, ఒకచోట చేర్చడానికి మేం చేసిన పనిని ఇప్పటికే వివరించాం. ఆ విపత్తును ఆపడానికి అమెరికాలోని అగ్ర నాయకులు కృషి చేశారు అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ (Tommy Bruce) తెలిపారు.