పౌరసత్వ చట్టంపై అమెరికా కీలక వ్యాఖ్యలు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కోసం భారత్ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌పై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం తమని ఆందోళనకు గురిచేస్తోంని పేర్కొంది. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌పై మేం ఆందోళన చెందుతున్నాం. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా గమనిస్తున్నాం. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూల సూత్రం అని అన్నారు.






