Russia:రష్యా యుద్ధాన్ని విరమించాలనే… భారత్‌పై :అమెరికా

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ విరమణను ప్రకటించేలా చేయటానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై భారీ సుంకాలు విధించారంటూ శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Caroline Leavitt) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ఆపాలన్న పట్టుదలతో ట్రంప్ ఉన్నారని, అందుకోసమే అన్ని వైపుల నుంచి రష్యా (Russia) పై ఒత్తిడి తెస్తున్నారని మీడియా సమావేశంలో లీవిట్ పేర్కొన్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహమని అభివర్ణించారు. నాటో (NATO) సెక్రటరీ జనరల్, యూరోపియన్ నేతలు, ఉక్రెయిన్ (Ukraine )అధ్యక్షుడితో జరిపిన చర్చలను యుద్ధం ముగింపునకు తొలి అడుగుగా పేర్కొన్నారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే అసలు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమయ్యేది కాదని ఉద్ఘాటించారు.