చైనా వైఖరిని తప్పబట్టిన అమెరికా
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని, ఈ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా చేసే ప్రయత్నాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పింది. వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంట ఆక్రమణ యత్నాలను తాము ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ముఖ్య ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా వాషింగ్టన్‌పై మండిపడిరది. అరుణాచరల్ ప్రదేశ్‌ను భారత్ భూభాగంగా ఆమెరికా గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. భారత్, చైనా సరిహద్దు విషయంలో వాషింగ్టన్కు ఎలాంటి సంబంధం లేదని విమర్శించింది. స్వార్థపూరిత భౌగోళిక రాజకీయాల కోసం అమెరికా ఇతర దేశాల కలహాలను ఉపయోగించుకుంటుందని ఆరోపించింది.






