జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని.. నెల తర్వాత మళ్లీ
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థల కారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. వారిద్దరి మధ్యం ఏం చర్చలు జరిగాయో తెలియరాలేదు. నెతన్యాహు తీరును తీవ్రంగా తప్పుబడుతూ ఇటీవల సెనెట్ మెజారీటీ నేత చుక్ ఘామార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండు చేశారు. ఘామార్ వ్యాఖ్యలను బైడెన్ సమర్థించకపోయినా రిపబ్లికన్లతో పాటు ఇజ్రాయెల్ అధికారులు తప్పుబట్టారు. ఇతర దేశాల ఎన్నికల వ్యవహారాల్లో తలదూర్చడం తగదని హితవు పలికారు. ఈ నేపథ్యంలో బైడెన్, నెతన్యాహు మాట్లాడుకోవడం గమనార్హం.






