Truck drivers: ట్రంప్ నిబంధనలతో భారతీయ ట్రక్కు డ్రైవర్లకు అవస్థలు

అమెరికాలో భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తీవ్ర చర్చలకు దారి తీసింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విదేశాల నుంచి వాణిజ్య రవాణా కోసం వచ్చే డ్రైవర్ల (drivers ) కు జారీ చేసే వర్క్ వీసా (Work visa) లను తక్షణమే నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ప్రకటన విడుదల చేశారు. విదేశీ వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు ఇచ్చే అన్ని వర్కర్ వీసాలను తక్షణమే నిలిపివేస్తున్నాం. అమెరికా రోడ్లపై విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోందన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన తెలిపారు. ఇటీవల ఫ్లోరిడా (Florida) లో చోటుచేసుకుంది. హర్జిందర్ సింగ్ (Harjinder Singh) అనే భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా యూ-టర్న్ తీసుకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.