Nicolas Maduro: అరెస్టుకు సాయం చేస్తే రూ.430 కోట్లు : అమెరికా
వెనుజువెలా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro)ను అరెస్టు చేసేందుకు సాయం చేస్తే 50 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.430 కోట్లు) నజరానా ఇస్తామని అమెరికా (America) ప్రకటించింది. మదురో ప్రపంచంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల సరఫరాదారుల్లో ఒకరని, ఫెంటానిల్ కలిపిన కొకైన్ (Cocaine)ను అమెరికాలో వ్యాపిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం నుంచి ఆయన తప్పించుకోలేడని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ (Pam Bondy) హెచ్చరించారు.







