Badar Khan Suri: ఆ భారతీయ విద్యార్థిని విడుదల చేయండి : అమెరికా న్యాయస్థానం
హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో అమెరికాలో అరెస్టయిన భారత విద్యార్థి బదర్‌ఖాన్ సూరి (Badar Khan Suri)కి న్యాయస్థానంలో ఊరట లభించింది. నిర్బంధంలో ఆ విద్యార్థిని వెంటనే విడుదల చేయాలని కోర్టు (Court )ఆదేశాలిచ్చింది. టెక్సాస్ (Texas) నుంచి వర్జీనియా (Virginia) వెళ్లేందుకు అనుమతించాలని డిస్ట్రిక్ట్ జడ్జి (District Judge ) తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయమూర్తి మాటలు విన్నప్పుడు తనకు కన్నీళ్లు వచ్చాయని సూరి భార్య సంతోషం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న బదర్‌ఖాన్ సూరి, హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడంటూ హోంల్యాండ్ భద్రతా విభాగం అధికారులు వర్జీనియాలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్టును సవాలు చేస్తూ సూరి కోర్టును ఆశ్రయించారు.







