భారత సంతతి శాస్త్రవేత్తకు కీలక హోదా

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‍కు భారత సంతతికి చెందిన ఇమ్యునాలజిస్టు శంకర్ ఘోష్ ఎంపికయ్యారు. ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలోని వాగెలాస్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్లో ప్రొఫెసర్‍గా పనిచేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనల్లో శంకర్ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ హోదా దక్కింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‍కు కొత్తగా ఎంపికైన 120 మంది సభ్యుల్లో ఆయన కూడా ఉన్నారు. శంకర్ రోగనిరోధక వ్యవస్థకు క్యాన్సర్, సెస్సిస్, మధుమేహం సహా అనేక రుగ్మతలతో ఉన్న సంబంధంపై పరిశోధనలు సాగిస్తుంటారు. డీఎన్‍ఏను ఆర్‍ఎన్‍ఏగా మార్చే పక్రియను నియంత్రించే కణ విధానాలను విస్త•తంగా శోధిస్తున్నారు.