కలిసి పనిచేస్తే బలపడతాం : బ్లింకెన్
భారత్, అమెరికా మరింతగా కలిసి పని చేయాలి. అప్పుడే ద్వైపాక్షిక బంధం మరింత బలపడుతుంది అని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ అన్నారు. ఇటలీలోని ఫిగ్గీలో జీ-7 సదస్సు సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ప్రపంచ భద్రత తదితరాలపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. భారత్`అమెరికా భాగస్వామ్యం కొనసాగింపుపై బ్లింకెన్‌తో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. అంతర్జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో మరింతగా కలిసి పని చేయాలని అమెరికా కోరుకుంటోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.






