ఇరాన్ కు జీ-7 దేశాల హెచ్చరిక
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు బాలిస్టిక్ క్షిపణులు సరఫరా చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా సహా జీ-7లోని ఐరోపా దేశాలు హెచ్చరించాయి. ఆయుధాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రష్యా, ఇరాన్ నుంచి స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసైళ్లు కొనుగోలు చేయనుందని తెలిసింది. ఈ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు ఇరాన్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ యంత్రాంగం అప్రమత్తమైంది. వీటిని మాస్కోకు సరఫరా చేస్తే ఇరాన్ పౌర విమానాలపై నిషేధం విధించే ఆలోచనలో జీ`7 దేశాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.






