భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్… నేటి నుంచి అమెరికా వీసా

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్‍లను అమెరికా రాయబార కార్యాలయం నేటి నుంచి కేటాయించనుంది. జులై, ఆగస్టు నెలల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది అమెరికా వెళ్లేందుకు వీసాలు ఇస్తామని యూఎస్ సీనియర్ రాయబారి డాన్ హెప్లిన్ తెలిపారు. అమెరికా వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు 3 రోజుల క్రితం తీసుకున్న కొవిడ్ నెగెటివ్ రిపోర్టు సరిపోతుందని చెప్పారు. విద్యార్థుల వెంట వారి తల్లిదండ్రులు వెళ్లే అనుమతి లేదన్నారు.