భారత నౌకాదళం భేష్ : అమెరికా రక్షణ మంత్రి ప్రశంస
హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి, సముద్రపు దొంగల చేతిలో చిక్కుకున్న ఒక వాణిజ్య నౌకను విడిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 17 మంది బందీలను విడిపించి, 35 మంది సాయుధ సముద్రపు దొంగలను నిర్బంధించింది. ఈ నేపథ్యంలో భారత నౌకదళాన్ని ఆస్టిన్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా నుంచి 31 ఎంక్యూ`9బి డ్రోన్ల కొనుగోలు చేయాలన్న భారత ప్రణాళికలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు.






