America: అమెరికాలో ధరల మోత …అన్నీ భారమే
డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికాలో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసరాల నుంచి వ్యక్తిగత సంరక్షణ వస్తువుల ధరల మోతతో అక్కడి ప్రజలు షాపింగ్ కార్డ్ (Shopping card )బరువెక్కు తోంది. ఎడాపెడా సుంకాలతో భారత్ (India0సహా వివిధ దేశాలను బాదేడయం, పెంచిన సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే దుస్తులు, బ్యాగులు (Bags) సహా మరెన్నో వస్తువుల ధరలు పెరిగాయి. టాయ్లెట్ పేపర్ రేట్లు కూడా ఎగబాకాయి. రాబోయే రోజుల్లో డైపర్ల నుంచి షాంపూ , స్కిన్ కేర్ ఉత్పత్తులు సహా దిగుమతి చేసుకునే ప్రీమియం మద్యం, కార్లు వంటి విడిభాగాల ధరలూ పెరగనున్నాయి. మొత్తంగా చూస్తే ఒక్కో కుటుంబంపై ఏడాదికి సగటన 2,400 డాలర్ల ( భారత రూపాయి ప్రకారం రూ.2.11 లక్షలు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.







