US Citizenship : అమెరికా పౌరసత్వం రావాలంటే : యూఎస్‌సీఐఎస్ ఆదేశం

వలసదారుల పౌరసత్వ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనే సమయంలో నైతిక ప్రవర్తన పై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను అమెరికా పౌరతస్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ఆదేశించింది. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకొనేవారికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం మంచి నైతిక ప్రవర్తనగా అమెరికా ఇమిగ్రేషన్ (US Immigration) చట్టం పేర్కొంటోంది. ఇప్పుడు దీని పరిధిని మరింత విస్తరించనున్నారు. కుటుంబ బంధాలకు, సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, సమాజంతో మమేకమవడం, ఉన్నత విద్యార్హతలు, స్థిరమైన, చట్టబద్ధమైన ఉద్యోగం (Job), పన్ను చెల్లించే స్థితి వంటి అంశాలతో పాటు దరఖాస్తుదారులు అమెరికా (America) లో నివసించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు.