అమెరికా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు
యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను శీతాకాలం ముందు పునరుద్ధరించుకునేందుకు వీలుగా 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,880 కోట్లు) మానవతాసాయం అందించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు సంఫీుభావాన్ని గట్టిగా ప్రకటించడానికి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో కలిసి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆయన పర్యటించారు. అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు. పశ్చాత్య దేశాలు సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా లోలోపలి ప్రాంతాలపైకి ప్రయోగించేందుకు అనుమతించాలని ఉక్రెయిన్ మరోసారి ఒత్తిడి చేసింది. మారిన అవసరాల నేపథ్యంలో దీనిపై తమ అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి ఏటా 300 కోట్ల పౌండ్లను బ్రిటన్ కేటాయిస్తోందని లామీ తెలిపారు.






