Swimming: ప్రపంచ రికార్డు సాధించిన అమెరికా మహిళల బృందం

ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ (Swimming Championship) లో అమెరికా క్రీడాకారులు అదరగొట్టారు. 9 స్వర్ణాలు సహా 29 పతకాలతో టోర్నీలో ఆ దేశమే అగ్రస్థానం సాధించింది. చివరి రోజు ఆదివారం మహిళల 4 100 మీటర్ల మెడ్లీ రిలే పోటీలో ఆ దేశ స్విమ్మర్లు ప్రపంచ రికార్డు (World record )తో స్వర్ణం సాధించారు. అమెరికా బృందం 3 నిమిషాల 49.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తన పేరిటే ఉన్న రికార్డు (3.49.63 సె) ను బద్దలు కొట్టింది. పోటీల్లో ఆస్ట్రేలియా (Australia) 8 స్వర్ణాలు సహా 20 పతకాలతో రెండో స్థానం సాధించింది. ఫ్రాన్స్ (France) (4 స్వర్ణాలు), కెనడా (4 స్వర్ణాలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కెనడా (Canada) స్విమ్మర్ సమ్మర్ మెకింతోష్ నాలుగు స్వర్ణాలతో ఈ పోటీల్లో ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది.