లండన్ టూ న్యూయార్క్… మూడున్నర గంటల్లోనే!

లండన్ నుంచి న్యూయార్క్ కు విమానం ద్వారా వెళ్లాలంటే సుమారు 8 గంటల సమయం పడుతుంది. కానీ ఈ గమ్యానికి కేవలం 3.30 గంటల్లోనే చేరుకునేలా యూనైటెడ్ ఎయిర్‍లైన్స్ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. సూపర్ సోనిక్ విమానాల ద్వారా లండన్ నుంచి న్యూయార్క్ కు మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చని, 2029 కల్లాఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. తొలి సూపర్ సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికన్ ఎయిర్‍లైన్స్, యూనైటెడ్ ఎయిర్‍లైన్స్లు భద్రతాపరమైన పరీక్ష విజయవంతమైన తరువాత 15 ఓవర్చ్యూర్ ప్యాసింజర్ జేట్‍లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు జెట్ మేకర్ బూమ్ సూపర్ సోనిక్ తెలిపింది.
ప్రస్తుతం వీటి తయారీ కొనసాగుతోంది. పూర్తయిన తరువాత.. 60 వేల అడుగుల ఎత్తులో ఇవి ఎగురనున్నాయి. కార్బన్ ఉద్గారాలు ఉండవు. 100 శాతం విమాన ఇంధనం ఆధారంగా ఎగురగలవు. ఇవి చాలా వేగంగా సమర్థంతంగా ఉండటమే కాకుండా, పర్యావరణ అనుకూలంగా ఉండనున్నాయి.