TikTok: చైనాతో కుదిరిన ఒప్పందం .. టిక్‌టాక్ అమెరికా వశం!

అమెరికా-చైనా అధికారుల మధ్య స్పెయిన్‌లో జరిగిన భేటీ బాగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ సందర్భంగా తమ దేశంలోని యువత ఎక్కువగా కాపాడాలని కోరుకునే సంస్థ ( సోషల్ మీడియా సంస్థ టిక్‌టాక్) విషయంలో చైనా (China) తో ఓ ఒప్పందం కుదిరిందని వెల్లడిరచారు. ఇదిలా ఉండగా టిక్‌టాక్ యాజమాన్య హక్కులపై అమెరికా- చైనాల మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ (Scott Besant) ప్రకటించారు. స్పెయిన్‌లో ఇరుదేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుది ఒప్పందం ఖరారుకు తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping) తో సంభాషించనున్నట్లు తెలిపారు. అయితే టిక్‌టాక్ యాజమాన్య హక్కులు అమెరికాకు దక్కాలన్నదే ఒప్పందం అంతిమ లక్ష్యంమని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాథమిక స్థాయిలో ఒప్పందంపై రెండువైపులా ఏకాభిప్రాయం కుదిరిందని చైనా అంతర్జాతీయ వాణిజ్య ప్రతినిధి లీ చెంగాంగ్ ధ్రువీకరించారు.