Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలిచాడు. తన మాజీ భార్య నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటున్న పాండ్యా, మరోసారి ప్రేమలో పడినట్టు సమాచారం. బ్రిటన్ కు చెందిన గాయని జాస్మిన్ వాలియాతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు, హార్దిక్ మోడల్ నుండి నటిగా మారిన మహికా శర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ కథనాలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ వివాహం చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
రెడ్డిట్(Reddit) లో ఒక పోస్ట్ లో మహికా సేల్ఫీ పోస్ట్ చేయగా.. అందులో అబ్బాయి ఫోటో హైలట్ అయింది. అతను హార్దిక్ పాండ్యానే అంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఇక మరో సోషల్ మీడియా యూజర్, ఆమె పోస్ట్‌లలో ఒకదానిలో హార్దిక్ జెర్సీ నంబర్ – 33 కనిపించడాన్ని హైలెట్ చేయడంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అనే వార్తలకు బలం చేకూరింది. ఆ తర్వాత హార్దిక్, మహికా ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో కావడం కూడా హైలెట్ అయింది.
హార్దిక్, మహికా వేర్వేరు ఫోటోలలో ఒకే బాత్రూబ్ ధరించి ఉన్నట్లు కనపడింది. ఇక అక్కడి నుంచి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆసియా కప్(Asia Cup) కోసం ఆమె దుబాయ్ వెళ్తున్నట్టు కథనాలు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంచితే ఈ ఏడాది ప్రారంభంలో హార్దిక్.. యూకే గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. హార్దిక్ ఆడుతున్నప్పుడు ఆమె స్టేడియంలో కనిపించింది. ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ తర్వాత ఆమె ముంబై ఇండియన్స్ జట్టు బస్సులో కనపడింది. ఆ తర్వాత ఇద్దరూ ఈ వార్తలను ఖండించలేదు. కానీ వారు విడిపోయారని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారని వార్తలు వచ్చాయి.