China వాషింగ్టన్ చెప్పినట్లు చేస్తే .. అమెరికా మండిపడిన చైనా

తమతోపాటు పలు దేశాలు రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు వాటిపై నాటో, జీ7 దేశాలు టారిఫ్‌లు విధించాలని అమెరికా పిలుపునివ్వడంపై చైనా (China) తీవ్రంగా స్పందించింది.కేవలం ఏకపక్షంగా వేధించేందుకు ఆర్థిక బలప్రదర్శనకు ఇటువంటి చర్యలు చేపడుతోందని ఆరోపించింది. వాషింగ్టన్(Washington) చెప్పినట్లు చేస్తే మాత్రం తాము ప్రతిచర్యలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించింది. ఓ పక్క స్పెయిన్ మాడ్రిడ్‌లో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొదలైన వేళ చైనా నుంచి ఈ ప్రతి స్పందన రావడం గమనార్హం. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్ జిన్ (Lin Jin) మాట్లాడుతూ ప్రపంచంలోని ఇతర దేశాల వలే రష్యాతో కూడా తమకు సాధారణ సంబంధాలున్నాయన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా చర్యలు ఏకపక్ష వేధింపులు, ఆర్థిక బలప్రదర్శనకు నిదర్శనం. ఇవి తీవ్ర స్థాయిలో అంతర్జాతీయ వాణిజ్య నిబంధలను దెబ్బతీస్తాయి. అంతేకాదు ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక పంపిణీ వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు.