Ukrainian Sniper :ఉక్రెయిన్ సైనికుడు ప్రపంచ రికార్డు!
ఉక్రెయిన్ స్నైపర్ (Ukrainian sniper) యూనిట్ సైనికుడు ఒకరు ప్రపంచ రికార్కుడ బద్దలు కొట్టినట్లు తెలిసింది. 13,000 అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రష్యా (Russia) సైనికులను కాల్చి చంపారు. ఇంత దూరం నుంచి గురితప్పకుండా కాల్పడం ఓ ప్రపంచ రికార్డు (World record) . స్థానికంగా తయారు చేసిన ఎలిగేటర్ 14.5 ఎంఎం రైఫిల్‌ను వాడి పొక్రొవొస్క్ ప్రాంతంలో ఇద్దరు రష్యన్ సైనికులను నేల కూల్చినట్లు తెలిసింది. ఇందుకు కృత్రిమమేధ, డ్రోన్ సాయం తీసుకొన్నాడు. ఆగస్టు 13న ఈ ఘనత సాధించాడని తెలిసింది. పుతిన్- ట్రంప్ అలాస్కాలో భేటీ కావడానికి ఒక్క రోజు ముందు ఈ రికార్డు నెలకొల్పడం గమనార్హం. ఇటీవల కాలంలో పొక్రొవొస్క్ ప్రాంతంపై రష్యా దాడులు గణనీయంగా పెరిగాయి. ఈ పట్టణంలో దాదాపు 60,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గతంలో అత్యధిక దూరంలో లక్ష్యాన్ని చేదించిన రికార్డు కూడా 58 ఏళ్ల ఉక్రెయిన్ స్నైపర్ పేరిటే ఉంది.









