రష్యాకు ఉక్రెయిన్ చావుదెబ్బ.. ఈ దాడిలో
రష్యా వైమానిక స్థావరం లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో రష్యా ఎయిర్‌బేస్‌లోని ఆరు యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిసింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎస్‌బీయూ, సైన్యం సంయుక్తంగా దక్షిణ రోస్టవ్‌లోని మోరోజోవవ్స్క్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడినట్లు, ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసంగా కాగా, మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నాయి. డజన్ల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అటు ఉక్రెయిన్‌కు చెందిన 44 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఓ పవర్ సబ్‌స్టేషన్ కూడా ఈ దాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో రష్యా భద్రతా దళాలకు చెందిన దాదాపు 20 మంది వరకు సిబ్బంది ఈ దాడిలో మరణించి ఉంటాని కీవ్ ఇండిపెండెట్ అంచనా వేస్తోంది. రష్యా వాయుసేన శక్తిని ఈ దాడి గణనీయంగా తగ్గిస్తున్నందని ఉక్రెయిన్ చెబుతోంది. మొత్తం 53 డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించినట్లు సమాచారం. మరోవైపు బెల్గరోడ్, కరుస్క్ వద్ద కూడా ఉక్రెయిన్ డ్రోన్లు దాడులకు యత్నించాయి.






