ఉక్రెయిన్ కీలక నిర్ణయం… 27 నుంచి 25 ఏళ్లకు
రష్యాతో పోరు ఫలితంగా సైనికుల సంఖ్య భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్బంధ సైనిక శిక్షణకు వయసును 27 నుంచి 25 ఏళ్లకు తగ్గించినట్లు వెల్లడించింది. ఈ బిల్లును ఆ దేశ పార్లమెంటు గత ఏడాదే ఆమోదించినప్పటికీ, అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పుడే దానిపై సంతకం చేశారు. ఎందుకు ఈ బిల్లును అమలులోకి తెచ్చారనే దానిపై అధ్యక్ష కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. తాజా నిర్ణయంతో కొత్తగా ఎంతమంది సైన్యంలోకి వస్తారన్న దానిపైనా స్పష్టత లేదు. ఐదు లక్షల మంది సైనికులను సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు గత డిసెంబరులో జెలెన్స్కీ ప్రకటించారు. ఇన్నాళ్లుగా యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న సైనికులను మార్చడం, లేదా ఇంటికి వెళ్లేందుకు అనుమతించడం వంటి సున్నిత అంశాలపై పరిగణన లోకి తీసుకోవాలని సైనికాధికారులకు సూచించారు.






