UK Visa : భారీగా తగ్గిన యూకే వీసాలు

ఇమిగ్రేషన్ విధానంలో యూనైటెడ్ కింగ్‌డమ్ (యూకే) భారీ మార్పులు చేయడంతో ఇండియా నుంచి విద్యార్థులు(Students), వర్కర్ల వీసాలతో పాటు మరికొన్ని రకాల వీసాల్లోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి కూడా ఈ వీసాలు తగ్గుదల నమోదైంది. ఇప్పటి వరకు భారత్ (India )నుంచి అథ్యధికంగా బ్రిటన్ వీసాలు పొందుతున్నారు. మార్పుల మూలంగా ఇండియన్స్ వీసాలపై ప్రభావం ఎక్కువగా పడిరది. నైపుణ్యం ఉన్న వర్కర్ల వీసాల్లో 2025 జులై వరకు 18 శాతం తగ్గుదల నమోదైంది. 2023 ఆగస్టు నుంచి 2025 జులై వరకూ హెల్త్ కేర్ వర్కర్ల వీసాలు 93 శాతం తగ్గాయి. ఈ సంవత్సరం జులై వరకు హెల్త్ అండ్ కేర్ వర్కర్లకు సంబందించి డిపెండెంట్ వీసాలు(Dependent visas) 79 శాతం తగ్గాయి. జులై నాటికి విద్యార్థి వీసాలు 3 శాతం తగ్గాయి. 2023 డిసెంబర్ నుంచి 2025 జులై వరకు స్టూడెంట్ డిపెండెంట్ వీసాలు 86 శాతం తగ్గాయి. యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాలు 10 శాతం తగ్గాయి.