బ్రిటన్ లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. విదేశాల నుంచి బ్రిటన్కు వచ్చే విద్యార్థులు ఎక్కువమంది తమ కుటుంబాన్ని తీసుకువస్తుండటంతో వలసలను తగ్గించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మూడు నెలల నివేదికను హోంశాఖ వెల్లడిరచింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య విద్యార్థి ఆధారిత వీసాల సంఖ్య దాదాపు 80 శాతం తగ్గినట్లు పేర్కొంది.






