ఆ తేడానే.. గిన్నిస్ రికార్డును కట్టబెట్టింది

బ్రిటన్‍కు చెందిన దంపతులు జేమ్స్. క్లోయి లస్టెడ్లు ఎత్తులో భారీ వ్యత్యాసం ఉన్న భార్యాభర్తలుగా ఉన్నారు. ఆ తేడానే వీళ్లకు గిన్నిస్ రికార్డును కట్టబెట్టింది. అదేంటో తెలుసా? హైట్‍లో తేడా.. అదీ భర్త కన్నా భార్య ఎక్కువ ఎత్తు ఉండటం అనే కేటగిరిలోనట. జేమ్స్ పొడవు 3 అడుగుల 7 అంగుళాలు కాగా.. క్లోయి 5 అడుగుల 5.4 అంగుళాల పొడవు ఉన్నారు. అందరూ ఏమనుకుంటారో అని ముందు భయపడ్డామని, అయితే ఇప్పుడు చాలా ఆనందంగా జీవిస్తున్నామని ఆ జంట చెప్పింది.