Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?

హనుమాన్(hanu man) మూవీతో పాన్ ఇండియా స్థాయిలో మంచి బ్లాక్ బస్టర్ ను అందుకున్న తేజా సజ్జ(teja sajja) ప్రస్తుతం మిరాయ్(mirai) అనే యాక్షన్ అడ్వెంచర్ సూపర్ హీరో మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని(karthik ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్టే మిరాయ్ నుంచి రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మంచు మనోజ్(manchu manoj), శ్రియా శరణ్(sriya saran), రితికా నాయక్(ritika nayak) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఆడియన్స్ ను తప్పక మెప్పిస్తుందని నిర్మాతలు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిరాయ్ లో రెండు సర్‌ప్రైజులున్నాయని హీరో తేజ సజ్జ చెప్పారు. అయితే తేజ చెప్పిన ఆ సర్‌ప్రైజులేంటనేది ఇప్పుడు లీకులందుతున్నాయి.
మిరాయ్ మూవీలో రానా(rana) శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడని, మూవీలో అదే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందంటున్నారు. రానాతో పాటూ మిరాయ్ లో రవితేజ(raviteja), దుల్కర్ సల్మాన్(Dulqer Salman) కూడా స్పెషల్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ పై తేజ చాలా నమ్మకంగా ఉన్నారు.