America : అమెరికా సరిహద్దుల్లో పట్టుబడిన ఇద్దరు భారతీయులు
డంకీ రూట్లో అమెరికా (America )లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు భారతీయులు (Indians) అరెస్టయ్యారు. మెనే(Maine) రాష్ట్రంలోని బ్రిడ్జ్వాటర్ (Bridgewater) లో గల అమెరికా –కెనడా (America – Canada) సరిహద్దుల్లో వీరిని బోర్డర్ పెట్రోలింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు కస్టడీలో ఉన్నారని, చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని దేశం నుంచి పంపించేస్తామని అధికారులు వెల్లడిరచారు. అయితే, అరెస్టయిన వారి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. వీరి కాలినడకన సరిహద్దుకు చేరుకొని అక్కడి నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు బోర్డర్ పెట్రోలింగ్ సిబ్బంది వెల్లడిరచారు. సాధారణంగా ఈ ప్రాంతంలో అక్రమ చొరబాట్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. అయినప్పటికీ, అమెరికా కఠిన విధానాల్లో భాగంగా ఇటీవల సరిహద్దుల్లో గస్తీని పెంచిన సంగతి తెలిసిందే.







