Putin:పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేక రాయబారి భేటీ ..యుద్ధం కొలిక్కి వచ్చేనా?

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై ఓ ఒప్పందానికి రావాలంటూ రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోతే పెద్దఎత్తున సుంకాలతో శిక్షిస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ (Steve Witkoff) మాస్కో (Moscow) వేదికగా రష్యా అధినేత పుతిన్ (Putin) తో సమావేశమయ్యారు. ఒప్పందం విషయంలో పుతిన్‌కు ట్రంప్ విధించిన గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా దండయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.