Peter Navarro : భారత్‌పై ట్రంప్ సలహాదారు నవరో అక్కసు
రష్యా ముడిచమురును దిగుమతి చేసుకుని, దాన్ని అధిక విలువగల ఉత్పత్తులుగా మార్చి ప్రపంచదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం రష్యాకు క్లియరింగ్ హౌస్‌లా వ్యవహరిస్తోందని, పుతిన్ (Putin)కు కావాల్సిన డాలర్లను ఇస్తోందని, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సలహాదారు పీటర్ నవరో (Peter Navarro) మండిపడ్డారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలన్న అంతర్జాతీయ ప్రయత్నాలకు భారత్ గండికొడుతోందని ధ్వజమెత్తారు. తాము వద్దంటున్నా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, వాణిజ్య ఒప్పందం విషయంలోనూ గట్టిగా వ్యవహరిస్తుండడంపై ఆయన తన అక్కసు వెళ్లగక్కారు. భారతదేశం అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి కావాలనుకుంటే, అలా ప్రవర్తించాలని సుద్దులు చెప్పారు.









