Study Visa: యూకే స్టడీ వీసాలు కఠినతరం
అంతర్జాతీయ విద్యార్థులు స్టడీ వీసాలను ఆశ్రయం పొందే మార్గంగా ఉపయోగించడాన్ని నిలువరించడంపై యూకే దృష్టి సారించింది. ముఖ్యంగా పాకిస్థాన్ (Pakistan) వంటి అధిక ఆశ్రయం క్లెయిమ్ రేట్లు ఉన్న దేశాల నుండి విద్యార్థి వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు యూకే ప్రభుత్వం (UK Government) తెలిపింది. స్టడీ వీసా (Study visa )లపై వచ్చి ఆశ్రయం పొందేందుకు వెళ్లే విదేశీ పౌరుల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి, ఈ వ్యక్తుల ప్రొఫైల్‌పై వారిని త్వరగా, వేగంగా గుర్తించడానికి మేము నిఘా మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని యూకే హోం ఆఫీస్(Home Office) ప్రతినిధి అన్నారు. మేము వీసా వ్యవస్థను నిరంతరం సమీక్షలో ఉంచుతాము. మా ఇమిగ్రేషన్ నియమాలను దెబ్బతీసే ధోరణులను గుర్తించిన వెంటనే చర్చలు చేపడతాం. మా ప్రణాళిక ప్రకారం, రాబోయే ఇమిగ్రేషన్ శ్వేతపత్రం మా విచ్చిన్నమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుంది అని సదరు ప్రతినిధి తెలిపారు. హోం ఆఫీస్ డేటా ప్రకారం పాకిస్థాన్ జాతీయుల ఆశ్రయం క్లైయిమ్లు గత సంవత్సరంలో 79 శాతం పెరిగి 10,542కు చేరుకున్నాయి. ఇది మిగతా దేశాలకంటే అత్యధికం. ప్రతిపాదిత అణిచివేత గురించి మరింత సమాచారం ఇమిగ్రేషన్ శ్వేతపత్రంలో ఉంటుందని భావిస్తున్నారు. దీనిని ప్రభుత్వం ఈ నెల చివరిలో వెల్లడిరచాలని యోచిస్తోంది.







