అరవై ఏళ్ల తర్వాత ఒకే రోజు…

మే 26 (బుధవారం) జాబిల్లి భూమికి అత్యంత సమీపంగా వస్తుంది. ఫలితంగా 2021లో అత్యంత పెద్ద చందమామ లేదా సూపర్ మూన్ ను భూమి మీద ఉన్నవారు చూస్తారు. బుధవారం కనిపించనున్న మరో అరుదైన ఖగోళ సంఘటన ఏమిటంటే ఈ ఏడాదిలో కనిపించే ఏకైక సంపూర్ణ చందగ్రహణం కనిపించడం. జనవరి 2019 తర్వాత మే 26న కనిపించేదే మొదటి సంపూర్ణ చందగ్రహణం అవుతుంది. నేడు ఆకాశంలో కనిపించే సంపూర్ణ చందగ్రహణానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే దాదాపు అరవై ఏళ్ల తర్వాత ఒకే రోజు సంపూర్ణ చంద్ర గ్రహణం, సూపర్ మూన్ కనవిందు చేయడం.