America: అమెరికాలో భారీ దోపిడీ ..2 నిమిషాల వ్యవధిలో

అమెరికాలోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు (Thieves) మెరుపువేగంతో తమ పని పూర్తి చేశారు. రెండు నిమిషాల వ్యవధిలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వెస్ట్ సియాటెల్ లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో తాజాగా ఈ ఘటన జరిగింది. కేవలం 90 సెకన్ల వ్యవధిలో సుమారు రూ.17 కోట్ల విలువైన నగలు, వజ్రాలు (Diamonds), ఖరీదైన గడియారాల (Watches)ను దోచుకున్నారు. గురువారం స్టోర్‌కు కొద్ది సేపు తాళం వేసి లోపల వేరే పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండగా, మాస్కులు ధరించిన నలుగురు దుండగులు ముందు భాగంలో లాక్ చేసి ఉన్న గ్లాస్ డోర్ (Glass door) ను సుత్తులతో పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.