Jaishankar: ఉక్రెయిన్, గాజా యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌కు సమస్యలు

న్యూయార్క్‌లో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న యుద్ధాల వల్ల ఇంధనం, ఆహారం, ఎరువుల సరఫరా చైన్స్ దెబ్బతినడం, ధరలు పెరగడం వంటి సమస్యలు తలెత్తాయన్నారు. ఈ సంక్షోభం అనేక దేశాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని ఆయన (Jaishankar) అన్నారు.
ఈ క్లిష్ట సమయంలో చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని జైశంకర్ పిలుపునిచ్చారు. శాంతి స్థాపన లేకుండా అభివృద్ధి అసాధ్యమని ఆయన (Jaishankar) స్పష్టం చేశారు. ఉగ్రవాదం అనేది అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి అని, దానిపై ప్రపంచ దేశాలు ఏమాత్రం రాజీ పడకూడదని అన్నారు. సంక్షోభంలో ఉన్న ఇరుపక్షాలతో మాట్లాడే సామర్థ్యం ఉన్న దేశాలు శాంతి స్థాపనకు ముందుకు రావాలని ఆయన (Jaishankar) సూచించారు.