NMC: విదేశాలకు వెళ్లేవారికి ఎన్‌ఎంసీ హెచ్చరిక … ఆ నాలుగు వైద్య వర్సిటీల్లో

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు ఆయా కళాశాలలు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సరిచూసుకోకపోతే నష్టపోతారని ఆ సంస్థ విడుదల చేసిన అలర్ట్ నోటీసులో హెచ్చరించింది. ముఖ్యంగా బలీజ్ (Belize) దేశంలోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ (Washington University) ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్‌తో పాటు, ఉజ్జెకిస్థాన్ (Uzbekistan)లోని చిర్చిక్ బ్రాంచ్ ఆఫ్ తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీల్లో చేరవద్దని సూచించింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్వివిద్యాలయాల్లో ఎంబీబీఎస్ (MBBS) చదివితే భారతదేశంలో వైద్యుడిగా రిజిస్ట్రేషన్ పొందే అర్హతను కోల్పోతారని ఎన్‌ఎంసీ హెచ్చరించింది.