Manohar Reddy:అరేనా ఇన్నోవా బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు యువకుడు

తెలుగు యువకుడు మనోహర్ రెడ్డి (Manohar Reddy) అంతర్జాతీయ వేదికలపై ఐటీ ఆవిష్కరణల్లో ప్రతిభను చాటారు. యూకేలోని ఐటీ ఇండస్ర్టీ అవార్డ్స్ (IT Industry Awards) -2025లో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి విభాగంలో రెండోసారి ఎంపికయ్యారు. 2024లో జరిగిన ఐదో ఎడిషన్‌లో ఆయన ప్రతిపాదించిన అటానమస్ సెక్యూరిటీ రోబోట్స్ ప్రాజెక్టుకు అవార్డు దక్కింది. విమానాశ్రయ భద్రతకు ఆ ప్రాజెక్టు కొత్త దిశ చూపుతుందని విశేష ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఆయన రూపొందించిన ఏఐ ఏరో ఆప్స్ డాష్‌బోర్డు ప్రాజెక్టుకు సైతం అవార్డు రానుంది. దీంతోపాటు మనోహర్‌రెడ్డి 2025 ఏడాదికి గాను స్పెయిన్ (Spain) లోని అరేనా ఇన్నోవాకు బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) గా నియమితుడయ్యారు.