PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలపై తగ్గనున్న పన్నుల భారం

భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల పన్నుల భారం తగ్గుతుందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. యూపీ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీలో తీసుకువచ్చిన తాజా సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, వినియోగదారుల పొదుపును కూడా పెంచుతాయని అన్నారు. ప్రజల మద్దతు ఉంటేనే ఈ సంస్కరణలు విజయవంతంగా కొనసాగుతాయని ఆయన (PM Modi) పేర్కొన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ గురించి కూడా ప్రస్తావించిన మోడీ (PM Modi).. దేశంలోనే ప్రతి వస్తువును తయారు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్వావలంబనపై దృష్టి పెట్టిందని, దీనికి అనుగుణంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద పరిశోధన, ఆవిష్కరణలలో పెట్టుబడులు పెంచాలని సూచించారు. రష్యా సహకారంతో ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన (PM Modi) ప్రకటించారు. ఈ రక్షణ కారిడార్ దేశీయ ఆయుధాల తయారీని పెంచుతుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని మోడీ పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ అనే సంకల్పంతో రాబోయే దశాబ్దాలకు కేంద్ర ప్రభుత్వం ఒక బలమైన పునాది వేస్తోందని స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త గమ్యస్థానంగా మారుతుందని ఆయన (PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు.