Zakir Hussain: ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు
దేశం గర్వించదగ్గ తబలా మేస్ట్రో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ (Zakir Hussain) 60 ఏళ్ల అద్భుత సంగీత ప్రస్థానం ముగిసింది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే అరుదైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న 73 ఏళ్ల హుస్సేన్ తుదిశ్వాస విడిచారు. అమెరికా (America )లో ఉంటున్న ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు వారాల క్రితం శాన్ఫ్రాన్సిస్కో (San Francisco) లో ఆస్పత్రిలో చేరారు.ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఐసీయూకు మార్చారు. సోమవారం తెల్లవారుజామున జాకిర్ హుస్సేన్ తుది శ్వాస విడిచినట్టు ఆయన సోదరి ఖుర్షీద్ ఔలియా (Khurshid Auliya) తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీ తదితర రాజకీయ ప్రముఖులు, అమితాబ్ బచ్చన్ వంటి సినీ నటులు మొదలుకుని హరిప్రసాద్ చౌరాసియా వంటీ సంగీత దిగ్గజాల దాకా అందరూ ఆయన మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు.







