Ind vs Pak: షేక్ అందుకే ఇవ్వలేదు, పాక్ కు భారత్ డాషింగ్ రిప్లై..!

జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులు, ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాకిస్తాన్ విషయంలో భారత్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో కూడా క్రికెట్ అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. అయితే ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ అయూబ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్ళు కరచాలనం చేయలేదు.
దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన అసహనం వ్యక్తం చేస్తూ వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. రిఫరీపై పాకిస్తాన్ ఆరోపణలకు దిగగా దీనిపై భారత్ స్పందించింది. గత ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన హై ప్రొఫైల్ ఆసియా కప్, గ్రూప్ ఏ మ్యాచ్ కు ముందు టాస్ సమయంలో కరచాలనం చేయవద్దని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఇద్దరు కెప్టెన్లకు సూచించాడనే పాకిస్తాన్ ఆరోపణను భారత క్రికెట్ జట్టు తోసిపుచ్చింది. టాస్ సమయంలో సాంప్రదాయం ప్రకారం కరచాలనం చేయవద్దని.. పైక్రాఫ్ట్ చెప్పడం ద్వారా ఐసిసి ప్రవర్తనా నియమావళిని, క్రికెట్ స్ఫూర్తిని ఉల్లంఘించారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
దీనిపై భారత క్రికెట్ వర్గాలు స్పందిస్తూ.. పైక్రాఫ్ట్.. సూర్యకుమార్‌కు అలాంటి సూచనలను చేయలేదని, టాస్ కు ముందే నిర్ణయం తీసుకున్నామని, బాధితులకు, కాశ్మీర్‌లో సైనిక కార్యకలాపాలకు సంఘీభావంగా భారత ఆటగాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ నిర్ణయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. జీవితంలో కొన్ని విషయాలు, కొన్ని అంశాలు క్రీడాకారుల స్ఫూర్తి కంటే ముందుంటాయి అని నేను భావిస్తున్నానని పేర్కొన్నాడు. అటు ఐసీసి కూడా దీనిపై స్పందించింది. ఈ విషయం ఆసియా క్రికెట్ అసోసియేషన్ అధికారులకు, పీసీబీ డైరెక్టర్ కు తెలుసనీ వ్యాఖ్యానించింది.