Walmart: మిషిగన్ వాల్‌మార్ట్‌లో కలకలం .. 11 మందికి
                                    అమెరికాలోని మిషిగన్‌లో ఓ వ్యక్తి 11 మందిని కత్తితో గాయపరిచాడు. ట్రావెర్స్ సిటీ (Traverse City)లోని వాల్‌మార్ట్ స్టోర్ (Walmart Store )లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ 42 ఏళ్ల వ్యక్తి కత్తితో స్టోర్‌లోకి ప్రవేశించాడు. కనిపించిన వ్యక్తినల్లా పొడవడం ప్రారంభించారు. పోలీసులు (Police) రంగప్రవేశం చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 11 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొందరికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటన సినిమా (movies )ల్లో మాత్రమే చూస్తాం. నాకు చాలా భయమేసింది అని ఓ ప్రత్యక సాక్షి తెలిపారు.







