స్పేస్ఎక్స్ ఘనత …అంతరిక్షంలో తొలిసారి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర స్పష్టించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ ద్వారా నలుగురు నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్‌మన్ తొలుత క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చిన స్పేస్‌వాక్ నిర్వహించారు. ప్రొఫెషనల్ వ్యోమగామలు కాకుండా, అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. తర్వాత స్పేస్ఎక్స్ ఇంజినీర్ సారా గిల్లిస్ ఆయన్ను అనుసరించారు. స్పేస్ ఎక్స తయారు చేసిన స్పేస్‌సూట్‌ను వారు పరీక్షించారు.






