అంతరిక్షంలోకి తొలిసారి.. నలుగురితో బయలుదేరిన
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించేందుకుగానూ నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది. ఈ మేరకు ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్`9 రాకెట్ దూసుకెళ్లింది. ఈ మొత్తం మిషన్‌కు వ్యాపారవేత్త జేర్డ్ ఇసాక్‌మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా వాయుసేన మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు స్పేస్ఎక్స్కు చెందిన మిషన్ ఇంజినీర్లు సారా గిల్లి, అన్నా మెనోన్ ఉన్నారు. ఇది విజయవంతమైతే పోలారిస్ మిషన్‌లో మొదటి మానవసహిత యాత్రగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ఎక్స్ పరికరాలనే వినియోగిచారు. ఈ ప్రాజెక్టును ఆగస్టు 27నే చేపట్టాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది.






