Jaishankar: మాస్కోకు విదేశాంగ మంత్రి జైశంకర్
పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయాలని, లేదంటే అధిక పన్నులు విధిస్తామని అమెరికా- భారత్ (India) పై బెదిరింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 20-21 తేదీలలో మాస్కో (Moscow)లో పర్యటించనున్న విదేశాంగ మంత్రి ఇరుదేశాల సంబంధాలపై ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావోరోవ్(Sergei Lavrov) తో చర్చలు జరపనున్నట్లు సమాచారం.







