పశ్చిమదేశాలకు రష్యా గట్టి వార్నింగ్ .. అణుయుద్దానికి
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసిన రష్యా, పశ్చిమదేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అణు యుద్దానికి సిద్ధమవండి అంటూ హెచ్చరించింది. అమెరికా యుద్ధకాంక్షపై అగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను బదిలీ చేయడం ద్వారా అమెరికా మరో భారీ యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించింది. ఈ మేరకు రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్ర మైద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని చాలా మంది జీవితాలను బలిగొనేందుకు బైడెన్ సిద్ధమయ్యారని విమర్శించారు. కీవ్‌కు అణ్వాయుధాల సరఫరాలను తీవ్రంగా పరిగణిస్తాం. ఈ చర్యను రష్యాపై దాడిగానే భావిస్తాం. ఆ ఆయుధాలు మాపై ప్రయోగిస్తే, కొత్త అణు విధానం ప్రకారం ప్రతి స్పందన తీవ్రంగానే ఉంటుంది అని దిమిత్ర పేర్కొన్నారు.






