Vladimir Putin : డిసెంబర్‌లో భారత్‌కు పుతిన్

భారత్-మాస్కో మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladimir Putin) డిసెంబర్‌లో ఇండియా (India) లో అధికారిక పర్యటన జరుపనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ధ్రువీకరించింది. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. చైనా (China) లో ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో పుతిన్ చర్చలు జరుపుతామని క్రెమ్లిన్ అధికారి యూరి ఉషకోవ్ తాజాగా తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ డిసెంబర్ పర్యటనకు సంబంధించిన సన్నాహకాలపై ఉభయ నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.