India : భారత్ కు శుభవార్త .. రష్యా నుంచి చౌకగా

అమెరికా నుంచి భారీ సుంకాలు ఎదుర్కొంటున్న భారతదేశానికి శుభవార్త. రష్యా (Russia) నుంచి మరింత చౌకగా చమురు సరఫరా కానున్నది. భారతదేశానికి అందే చమురుర బ్యారెల్ కు 3 నుంచి 4 డాలర్ల మేరకు తగ్గింది. సెస్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్‌లో లోడ్ అయ్యే కార్గోలకు రష్యా ఉరల్ గ్రేడ్ చమురు తక్కువ ధరకు అందుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం(India) ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందన్న సాకుతో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గతవారం నుంచి భారత్ పై విధించిన సుంకాన్ని 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, యురోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధంచడంతో భారతదేశం రష్యా నుంచి ప్రధాన ముడిచమురు దిగుమతిదారు అయింది. ఎస్‌సీఓ సదస్సులో పుతిన్(Putin) , మోడీ(Modi) , జిన్‌పింగ్ (Jinping) సమావేశంతో మూడు దేశాల మధ్య బంధం బలపడిరది.