ఎస్-400 విషయంలో భారత్‌కు షాకిచ్చిన రష్యా
భారత్‌కు రష్యా షాకిచ్చింది. మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400లను భారత్ ఇప్పట్లో భారత్‌కు అందించలేమని రష్యా వెల్లడించింది. కేంద్ర రక్షణ శాఖ నుంచి అందిన సమాచారం ఆధారంగా సుదీర్ఘకాలం నుంచి యుక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నందునే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2024 ప్రారంభానికల్లా మొత్తం 5 ఎస్-400లు భారత్‌కు రష్యా అందజేయాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా ఆర్థికంగానూ, సైనిక, రక్షణ పరంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా కేవలం 3 మాత్రమే అందించగలిగింది. మిగిలిన 2 ఇంకా డెలివరీ చేయలేదు.
అయితే ప్రస్తుతానికి సాధ్యం కాకపోయినా.. 2026 మూడో త్రైమాసికంలోపు మిగిలిన 2 ఎస్-400 సిస్టంలను కచ్చితంగా అందిస్తామని రష్యా తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎస్-400 వ్యవస్థ ప్రపంచంలోనే మోస్ట్ ఎడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలలో ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణలను ధ్వంసం చేయవచ్చు. చైనాతో ముప్పు ఎదురుకావచ్చనే ఉద్దేశంతో భారత్.. 2018లో రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి రష్యా నుంచి 5 ఎస్-400లకు ఆర్డర్ చేసింది. అయితే అందులో ఇప్పటివరకు 3 ఎస్-400లు మాత్రమే భారత్‌కు అందించింది రష్యా. వీటిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వినియోగిస్తోంది. మిగిలిని రెండు ఎస్-400 విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది.






